శెట్టార్‌ సీఎం పదవినుంచి వైదొలగాలి: యడ్యూరప్ప

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌శెట్టార్‌ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పు కోవాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం మైనార్టీలో ఉందని ఆయన అన్నారు. పాలక పక్షం మైనార్టీలో పడటంతో శెట్టార్‌ సారధ్యంలోని భాజపా సర్కారు వెంటనే అధికారంలో నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు.