శ్రమశక్తి అవార్డు గ్రహీత నాగభూషయ్య కు ఘన సన్మానం

share on facebook

బూర్గంపహాడ్ మే 23 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన శ్రమశక్తి అవార్డు గ్రహీత ఐ టి సి.  పి ఎస్ పి డి గల్లా నాగభూషయ్య కు యాదవ సంఘం తరఫున ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఐ టి సి. పి ఎస్ పి డి లో నలభై సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడారు. టి ఎన్ టి యు సి లో కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ చైర్మన్ స్థాయికి చేరుకొని తన చుట్టూ ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ తన వద్దకు వచ్చిన సమస్యను ఐటిసి యాజమాన్యంతో చర్చించి పరిష్కరించి కార్మికులకు న్యాయం చేసే వారిని పలువురు కొనియాడారు. ఆయన ద్వారా ఎంతో మంది కార్మికులు ఐ టి సి లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు  ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఐ టి సి యాదవ సంఘం కార్మికులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షులు గల్లా సైదేశ్వర రావు, వెంకటరామారావు, యువ కార్మికులు పెరుగు నాగేశ్వరావు, బండారు సత్యనారాయణ, జక్కుల రాంబాబు, శీలం  చలమయ్య, పిల్లి శీను, పిడుగు కొండలరావు, సీనియర్ కార్మికులు వెంకట్రామయ్య, ఆనంద్, పోలీస్ ప్రసాద్, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చందు, గొడపర్తి రాంబాబు, మద్ది బోయిన ప్రవీణ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.