శ్రీకాకుళం రిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం

గుజరాతీపేట: శ్రీకాకుళం: రిమ్స్‌లో డయాలిసిస్‌ సేవలు మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేంద్ర అధ్యయన బృందం నాయకుడు ఎస్‌కె జైన్‌ తెలిపారు. శ్రీకాకుళం .జిల్లాలో కిడ్నీ వ్యాధులపై పరిశీలన జరిపేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన 5 గురు సభ్యుల బృందం  ఈరోజు రిమ్స్‌ డయాలిసిస్‌ కేంద్రాన్ని పరిశాలించింది. డయాలిసిస్‌ చేయించుకున్న రోగులను పరామర్శించింది. ఇక్కడ లభిస్తున్న  సేవల తీరును అడిగి తెలుసుకుంది. అనంతరం రిమ్స్‌ డైరెక్టర్‌ రామ్మూర్తిని కలిసిన ఈ బృందం సలహాలు.సూచనలు ఇచ్చింది.