శ్రీరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

అనంతపురం : అనంతపురం జిల్లా కోర్టు పరిటాల శ్రీరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీరామ్‌తోపాటు మరో ఐదుగురికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 25 వేల సొంత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని జిల్లా కోర్టు వారిని ఆదేశించింది. కాంగ్రెస్‌ నేత సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్ర పన్నారని పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.