శ్రీలంక విజయలక్ష్యం 315
హంబస్‌టోటా: శ్రీలకంతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలిమ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 315 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 96(97బంతుల్లో) పరుగులకు తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ విరాట్‌కోహ్లి (113బంతుల్లో 106) సెంచరీ కొట్టడంఈతో భారత్ 3వందల పైచిలుకు స్కోర్ సాధించగలిగింది. చివర్లో రైనా (50) కూడా వేగగంగా ఆడి అర్థసెంచరీ మార్కు చేరుకున్నాడు. గంభీర్(3), రోహిత్‌శర్మ(5) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో పెరారా3, కులశేఖర, మాధ్యూన్ తలో వికెట్ తీసుకున్నారు.