శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు చేరిక

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు చేరనుంది. తుంగభద్ర, అలమట్టి ప్రాజెక్టులకు కలిసి 80వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో మరికొన్ని రోజులపాటు శ్రీశైలానికి నీరు వదిలే అవకాశముంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లు రెండూ ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో భారీగా వరద వస్తే తప్ప వీటిలో నీటిమట్టం మెరుగయ్యే అవకాశం లేదు. మరోవైపు సాగర్‌ దిగువ భాగాన భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజికి 74 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజి వద్ద కూడా ఇంత వరద రావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. 15 వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు, మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలారు.