షాలీమార్‌- చెన్నైల మధ్య సూపర్‌ఫాస్ట్‌ వీక్లీ రైలు

సికింద్రాబాద్‌: ఈ నెల 23 న షాలీమార్‌-చెన్నైల మధ్య సూపర్‌ఫాన్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఆ తరువాత జులై 3 నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.20కు షాలీమార్‌లో ఇది బయలుదేరుతుంది. ప్రతి గురువారం సాయంత్రం 4.15కు చెన్నై నుంచి బయలుదేరుతుంది. మన రాష్ట్రంలో ఇది విజయనగరం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరుల మీదుగా ప్రయాణిస్తుంది.