షిండేతో తెలంగాణ- కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్ర హోమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఈమేరకు వారు షిండేకు వినతి పత్రం సమర్పించారు.