షెడ్యూల్‌ ప్రాంతంలో 1585 పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ

హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 1585 పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. షెడ్యూల్డు ప్రాంతంలో పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం 9జిల్లాల్లో కలెక్టర్ల అధ్య్షతన ఎంపిక కమిటీలు ఏర్పాటు చేస్తామని, జూలై 15న నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరితేది జూలై 28. అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితా ఆగస్టు 13న ప్రకటిస్తామన్నారు.