షెడ్స్ లో వృద్దులకు వితరణ న్యాయ వాదుల అండ !
షెడ్స్ లో వృద్దులకు వితరణ న్యాయ వాదుల అండ !
జనం సాక్షి / హైదరాబాద్:-మంచిర్యాల సమీపంలోని షెడ్స్ లో గల వృద్ధులను కలిసి డిఫెన్సె లీగల్ చీఫ్, ప్రముఖ న్యాయ వాది,ఎండి. సందాని, న్యాయవాదులు, డిఫెన్సె లీగల్ అసిస్టెన్స్ సభ్యులు..ఆర్ ఆర్. రాములు, సబ్బని సదయ్య లు పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు అందించారు.21 మంది వృద్దులకు శాలువాలు ఇచ్చారు. జిల్లా కోర్ట్, న్యాయ విజ్ఞాన విభాగం ఆదేశం మేరకు వృద్దుల వద్దకు వెళ్లి వారికి అండగా ఉంటామన్నారు. నిర్వాహకులు, మాజీ బిషప్ ఫాదర్ కున్నథ్, వికార్ జనరల్ ఫాదర్ థామస్ నిలియాని లు పాల్గొన్నారు