సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమపథకాలను ప్రజల్లోకితీసుకెళ్లేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంతో పాటు రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు.
 
             
              


