సచిన్‌ పైలట్‌కు మల్లీ గాలం వేసే పనిలో బిజెపి ?


చాపకింద నీరులా రాజస్థాన్‌ రాజకీయాలు
సిఎం గెహ్లాట్‌ విషయంలో మెత్తగా వ్వయహరిస్తోన్న కాంగ్రెస్‌
జైపూర్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): రాజస్థాన్‌లో మళ్లీ చాపకింద నీరులా బిజెపి రాజకీయాలు నడుపుతోంది. గతంలో ఓ మారు ఫెయిల్‌ అయిన కమలం పార్టీ వారు మళ్లీ సచిన్‌ పైలట్‌ను పట్టాలకు ఎక్కించే పనిలో పడ్డట్లు సమాచారం. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అంతా బాగుందని అనుకుంటోంది. సిఎం గెహ్లాట్‌ విషయంలో ఉన్న అసంతృప్తిని కాంగ్రెస అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పైలట్‌ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. రాహుల్‌ హావిూ ఇచ్చిన పైలట్‌కు న్యాయం జరగడం లేదని తెలుస్తోంది. ఇదే అవకావంగా మరోమారు బిజెపి ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ భవిష్యత్‌ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్‌ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్‌ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజస్ధాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వంపై గత ఏడాది సచిన్‌ పైలట్‌ సహా ఆయనకు మద్దతు ఇచ్చే పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలోనూ పైలట్‌ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాషాయ పార్టీతో తాను పోరాడిన క్రమంలో బీజేపీలో తాను చేరుతాననే ప్రచారం అసంబద్ధమని అప్పట్లో పైలట్‌ తోసిపుచ్చారు. ఈ నెలలో రాజస్ధాన్‌లో మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల నియామకాలు చేపడతారనే వార్తల నేపథ్యంలో పైలట్‌ బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. పైలట్‌ శిబిరంలో పదవుల పంపకంపై డిమాండ్లు ఊపందుకోవడంతో ఈ నెలలో జరిగే విస్తరణలో ఆయన వర్గీయులకు కీలక పదవులు ఇవ్వడంతో పాటు, రాజకీయ నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. ఇటీవల రాహుల్‌ గాంధీ మరోమారు రాజస్థాన్‌పై సవిూక్షించిన వృద్దనేత గెహ్లాట్‌ విషయంలో గట్టి నిర్ణయం తసీఉకోలేక పోయారు. దీంతో పైలట్‌ మళ్లీ తీవ్ర నిరాశలోకి జారుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనను బిజెపి దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు సాగవచ్చని అంటున్నారు.