సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థిసంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అయినప్పటికి కొందరు విద్యార్థులు ప్రధానగేటువరకు రావడంతో వారిని అరెస్టు చేశారు.