సత్తెనపల్లి మండలంలో వద్ద పెళ్లి ఆటో బోల్తా…..

గుంటూరు:సత్తెనపల్లి మండలం నందిగాం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద పెళ్లి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మోతాదుకు మించి ఆటోలో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.