సీబీఐ విచారణకు సహకరిస్తా:సబితా ఇంద్రారెడ్డి

మెదక్‌ అర్బన్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తానని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈరోజు మెదక్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ఇదివరకే తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని చెప్పారు.ఉప ఎన్నికలో పనితీరు పార్టీ తీర్పుపై ఎన్నికలు జరగలేదనిక ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎన్నికలు జరిగినట్లు అభిప్రాయపడ్డారు.2014 ఎన్నికల్లో మాత్రమే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 20వేల పొలిస్‌ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.పైరవీకి తావులేకుండా పారదర్శకంగా నియామాకాలు చేపడతామని వెల్లడించారు.