సమాజ సంక్షేమం లక్ష్యంగా పోలీసుల కృషి
సైకిల్ యాత్రను ప్రారంభించిన ఎస్పీ రంజన్ రతన్
జోగులాంబ గద్వాల, అక్టోబర్26(జనం సాక్షి); శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. శాంతిభద్రతల కోసం నిరంతరంగా కృషి చేస్తున్నామని అన్నారు. నేరాలు అదుపు చేసే విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గద్వాల పట్టణంలోని వైఎస్‌ఆర్ చౌరస్తా నుంచి బీచుపల్లి వరకు సైకిల్ యాత్రను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పోలీసులు ఎప్పుడూ సమాజం కోసం పాటుపడుతారని అన్నారు. తమ విద్యుతక్త ధర్మంలో వారు ఏనాడు అలసి పోరని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ షేక్ మహబూబ్ బాషా, ఎస్సైలు హరి ప్రసాద్ రెడ్డి, రమాదేవి, విజయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.