సరూర్‌నగర్‌లో 45ం కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో రూ.450కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించారని ఉప కలెక్టర్‌ చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18ఎకరాలకు నకిలీ దస్తావేజులు సృష్టించారని ఆయన ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ దస్తావేజులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.