సర్వేపల్లి రాధ కృష్ణ సేవలు

మరువలేనివి :ఆఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, క్రైమ్ మిర్రర్ :సోమవారం శామీర్ పేట లో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిలో నిష్ణాతులైన సర్వేపల్లి రాధాకృష్ణన్ తదుపరి కాలంలో భావి భారత రాష్ట్రపతి గా వారు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన చేసిన నిస్వార్థ సేవలు అమోఘమని ఆయన జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితి అని అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. అందరు రాధాకృష్ణన్ ఆదర్శాలను అనుసరించి భారత జాతి కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింప చేయాలని అఫ్జల్ ఖాన్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు చందర్ ,బుర్క సత్యనారాయణ,చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
5ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు