సహకార ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఒకరి మృతి
కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో సహకార ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక మనస్తాపానికి గురై గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పలివెల గ్రామానికి చెందిన గుర్రం భాస్కర్‌రావు(50) స్థానికి సహకార సంఘానికి డైరెక్టర్‌గా తెదేపా మద్దతుదారునిగా పోటీ చేశాడు. మొత్తం 13 స్థానాల్లో 10 కాంగ్రెస్, 3 వైకాపా చేజిక్కించుకోవడంతో మనస్తాపానికి గురైన భాస్కర్‌రావు ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంసభ్యులు తెలిపారు.