సహచట్టంతో పక్కా సమాచారం

కాటారం: సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు సహచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం తహశీల్దార్‌ ఎన్‌ రాజు అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో సహచట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హజరైన ప్రసంగించారు. విద్యార్ధి దశ నుంచే సహచట్టం పై అవగాహన పెంచుకుని సమాజానికి మర్గదర్శకంగా నిలవాలన్నారు. సహ చట్టం ద్వారా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రతీ సమాచారన్ని పక్కాగా పొందవచ్చాన్నారు. జిల్లా సమయన్వయకర్త కె. రాజేందర్‌ విద్యార్థులకు సహచట్టం పై అవగాహన కల్పించారు. కళాశాల కరస్పాండెంట్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.