సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం.

 

 

 

 

 

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 10. (జనంసాక్షి). సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల ప్రకాష్, నరేష్ ,సుజిత్ పలువు విద్యార్థులు పాల్గొన్నారు.