సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాల ధరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) :
పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ నస్పూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో 2012-2013 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశానికి సంబంధించిన ధరఖాస్తు ఫారాలను నుంచి 30 వ తేది వరకు భూపాలపల్లిలోని సింగరేణి పాఠశాలలో లభ్యమౌతాయని అధికార ప్రతినిధి కె. బాబు సత్యసాగర్‌ తెలిపారు. మొత్తం 150 సీట్లకు గాను సివిల్‌, కంప్యూటర్‌, మెకానికల్‌, మైనింగ్‌లలో 30 సీట్లు వేరువేరుగా ఉన్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు ఫారాలను రూపాయలు 50 చెల్లించి తీసుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరకాస్తు ఫారాలను సంబంధిత దృవపత్రముల జిరాక్స్‌ కాపీలను జతపరిచి సింగరేణి పాఠశాలలో ఈ నెల 30వ తేది సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని, వివరాలకు పాఠశాలు ప్రధానోపాద్యాయులను సంప్రదించగలరని అధికార ప్రతినిధి కె. బాబుసత్యసాగర్‌ తెలిపారు.