సిద్దిపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సునీల్

 రెడ్డి జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె లో శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన సహిత నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో శనివారం బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయానికి విరాళం తన వంతుగా విరాళం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సునీల్ రెడ్డికి చాలువ కప్పి ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో బిజెపి కమాన్ పూర్ మండల అధ్యక్షులు జంగపెళ్లి అజయ్, సీనియర్ నాయకులు మట్ట శంకర్, మచ్చగిరి రాము, మండల ప్రధాన కార్యదర్శులు మల్లారపు అరుణ్ కుమార్, బర్ల సదానందం, మహిళ మోర్చా అలుగువెల్లి కృష్ణవేణి, యువ మోర్చా మండల అధ్యక్షులు పంతకాని విష్వతేజ, కొయ్యడ సతీష్,మట్ట రాజయ్య, చిప్పకుర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు.