సీఎంతో వివిధ అంశాలపై చర్చించిన చిరంజీవి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ఈ సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్వపు ప్రజారాజ్యం పార్టీ నేతలకు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్‌ పదవుల్లో సముచితస్థానం కల్పించాలని కోరారు. పీఆర్పీ నేతలు చాలామంది నిరుత్సాహంతో ఉన్నారని వీలైనంత త్వరగా వారికి అవకాశం కల్పించాలని కోరారు. తిరుపతిలో మంచినీటి పథకం, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధికోసం నిధులు త్వరగా విడుదల చేయాలని కోరారు. పెరిగిన డీజిల్‌ భారం ప్రజలపై పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.