సీఎంపై లోకాయుక్త అసంతృప్తి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో తల పెట్టిన రాజీవ్‌ స్వగృహ, ఇందిరమ్మఇళ్ల స్థలాల కేటాయింపులో జరుగుతున్న ఆలస్వానికి రాష్ట్ర లోకాయుక్త ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను సంబంధించిన ఫైల్‌ను ఎలాంటి పురోగతి లేకుండా దీర్ఘకాలం ఎలా అట్టిపెట్టుకుంటారని ప్రశ్నించింది. కారణాలు లేకుండా ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్న అంశానికి సంబంధించి తక్షణం నివేధిక  సమర్పించాలని అధికారులను ఆదేశించింది. రాజీవ్‌ స్వగృహ కింద చేపట్టిన పథకంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవటాన్ని సవాల్‌ చేస్తూ ఆ జిల్లాకు చెందిన పి. రాజ్యలక్ష్మీ అనే మహిళ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. రాజీవ్‌ స్వగృహ పథకానికి గాను ప్రభుత్వం గతంలో కేటాయించిన 70 ఎకరాల్లోని వివిధ ఖనిజాల గనులతవ్వకాలను ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను లోకాయుక్త నివేదిక కోరింది.