సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం… దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి…. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్…

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం…
దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి….
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్…
శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 24
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణలో దళిత బిడ్డల ఆర్థిక ఎదుగుదల కోసం దళిత బంధు ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో వైఫై సేవలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని మెట్టుపల్లి లింగాపూర్ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలను అనుసంధానం చేసినందుకు శ్రీనివాస్ ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టి దళిత బిడ్డల ఆర్థిక ఎదుగుదల లక్ష్యంగా 10 లక్షల రూపాయల ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలను అనుసంధానం చేసి దళిత బిడ్డలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు ప్రతి దళిత బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ అంతం వీరారెడ్డి, మెట్ పల్లి సర్పంచ్ వంగల సరోజన, సంస్థ డైరెక్టర్ శోభన్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త వర్ధిని రవీందర్ రావు, ఉప సర్పంచ్ సంజీవ్ గ్రామపంచాయతీ పాలకొరక సభ్యులు, దళిత సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.