సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి
మహిళా సాధికారతకు తెలంగాణ పెట్టింది పేరు
మహిళల రక్షణ సంక్షేమానికి పెద్దపీట
ఉపాధి ఉద్యోగ విద్యా అవకాశాలలో సింహభాగం
నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సీఎం కేసీఆర్ మహిళా పక్షాపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది పేరని అభివర్ణించారు.గడిచిన తొమ్మిదేళ్లుగా చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో మాహిళల సంక్షేమానికి, రక్షణకు గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ నారీ లోకానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. షీ టీమ్స్, కళ్యాణాలక్ష్మి షాది ముబారక్, అమ్మవడి, కెసిఆర్ కిట్ ఇందుకు తార్కాణాలని ఉదహరించారు. ఇవి గాక విద్యా, ఉపాధి,ఉద్యోగ రాజకీయ రంగాలలో మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని కొనియాడారు. హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూడా మహిళను నిలబెట్టి గెలిపించుకున్న రికార్డ్ సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.తెలంగాణ లోని స్థానిక సంస్థలలో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేయడంతో పాటు నామినేటెడ్ పోస్టులలోను 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో చట్టసభలతో పాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న మహిళల సంఖ్య 67,486 అని, 50.07 శాతమని వెల్లడించారు.అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించి వారిని ఉన్నత శిఖరాలను అదోరోహించేలా చేస్తూ మహిళా పక్షపాతిగా నిలిచిన సీఎం కేసీఆర్ కు మహిళలు బాసటగా నిలబడ్డారని,భవిష్యత్ లోనూ అంతే అండగా ఉంటారని మంత్రి ఆకాంక్షించారు.