సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన మీడియాపై పోలీసులు తమ అక్కసువెళ్లగక్కారు. క్యాంపు కార్యాలయం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులను  మంజీర అతిధిగృహం వద్దే వేచి ఉండాల్సిందిగా సూచించారు. శుక్రవారం ఏబీవీపీ కార్యకర్తలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు  దిగి లోనికి చొచ్చుకెళ్లేందకు ప్రయత్నించారు. దీంతో అక్కడ  భద్రత ప్రశ్నార్థకంగా  ఉందటూ మీడియాలో కథనాలు వచ్చాయి.