సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
మునుగోడు సెప్టెంబర్06(జనం సాక్షి) :
మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన జీడిమడ్ల నరేష్ కూతురు జైసు పుట్టిన వెంటనే అనారోగ్యంతో గురి కావడంతో హైదరాబాదులోని సేవ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఆదుకునేందుకు రాష్ట్రవిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ యువజన విభాగం సీనియర్ నాయకులు బోయ లింగస్వామి బాధ్యత కుటుంబానికి అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం అని అన్నారు