సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) :
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏబివిపి డివిజన్‌ ఇంచార్జీ కక్కెర్ల శివ అన్నారు. ఆదివారం స్థానిక పట్టణ కేంద్రంలో ఏబివిపి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఎలాంటి వ్యాదులు సోకుండా ఆరోగ్య సిబ్బందితో ముందస్థు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో చైతన్యయాత్రలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆసంఘం నాయకులు వినయ్‌, సాబీర్‌, దినకర్‌, రాజు, అమీర్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.