సీబీఐ జేడీపై కేసు కొట్టివేత

హైదరాబాద్‌: దర్యాప్తు అంశాల్ని మీడియాకు వెల్లడిస్తున్నారంటూ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణపై దాఖలుచేసిన ప్రజాప్రయోజనవ్యాజాన్ని హైకోర్టు కొట్టి వేసింది. జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌,ఓఎంసీ కేసుల్లో దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాల్ని కొన్ని మీడియా సంస్థలకు ఆయన వెల్లడిస్తున్నారంటూ గుంటూరుకు చెందిన భవనం భూషణం అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ పిటిషన్‌ విచారణార్హం కాదంటూ కొట్టిపడేసింది. దీనికితోడు కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను పిటిషనర్‌కు పాతిక వేల రూపాయల జరిమానాను విదించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్నందున పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.