సీబీఐ ముందుకు ఇండియా సిమెంట్స్‌ ఎండీ

హైదరాబాద్‌: ఇండియా సిమెంట్స్‌ ఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు అయిన శ్రీనివాస్‌ ఈరోజు మరోమారు సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆయనను గత వారం కూడా విచారించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతవారమే రెండోరోజు హాజరై వివరణ  ఇవ్వాల్సి వున్నప్పటికీ అత్యవసర పనుల రీత్యా ఆయన కొంత సమయాన్ని కోరినట్లు సమాచారం. ఈ నీటి కేటాయింపుల విషయంలోనే సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది.