సురేష్ కల్మాడీకి ఏఏఏ ప్రెసిడెంట్ అవార్డు: కల్మాడీ తరపున..?

  teac1db7
  కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడిన సురేష్ కల్మాడీని ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ (ఏఏఏ) ప్రెసిడెంట్ అవార్డు వరించింది. ఆసియాలో అథ్లెటిక్స్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారలు అందించినందుకుగానూ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

వూవాన్‌లో జరిగిన ఏఏఏ గాలా డిన్నర్, అవార్డ్ సెర్మనీలో కల్మాడీ తరపున ఆ పురస్కారాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అదిల్లే ఈ అవార్డును స్వీకరించారు.

కాగా 2010 కామన్ వెల్త్ క్రీడల్లో జరిగిన కుంభకోణంలో అరెస్టైన కల్మాడీ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. కొన్ని నెలల కిందటే ఆయన ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ జీవితకాల అధ్యక్షుడుగా నియమితులైన సంగతి తెలిసిందే.