సూపర్‌-8లో పాకిస్తాన్‌

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డిలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పాక్‌ ఒపెనర్లు మహ్మద్‌ హఫీజ్‌45, ఇమ్రాన్‌ నజీర్‌72, తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టు విజయంలో కీలకపాత్ర వహించారు. బంగ్లా బౌలర్లలో అబ్దుల్‌ హసన్‌ 2 వికెట్లు తీసుకున్నాడు.