సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతం:లక్ష్మణ్‌

హైదరాబాద్‌:సాహసోపేతమైన సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చెప్పారు.ఇక్కడ క్రీడాకారులు కూడా అత్యంత ప్రతిభావంతులని కొనియాడారు,హుస్సేన్‌సాగర్‌లో యాట్‌ క్లబ్‌ నిర్వహించిన క్రీడాకారులతో కలిసి సెయిలింగ్‌లో పాల్గోన్న ఆయన సాగర్‌లో పర్యటించడం అత్యంత మదురానుభూతిని కలిగించిందన్నారు.అనంతరం పోటిల్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్‌ బహుమతులు అందించారు.ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే వారు భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించగలరని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.