సోనియమ్మగా గౌరవించి ఆదరించారు

` కాంగ్రెస్‌ను గెలపించండి
` విూకెప్పుడూ రుణపడి ఉంటాను
` సోనియా గాంధీ వీడియో సందేశం
న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి విూకు రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు తన విన్నపాన్ని తెలియజేశారు. మార్పు కోసం కాంగ్రెస్‌ కి ఓటేయాలని పిలుపు ఇచ్చారు. విూకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అని అన్నారు. ఎప్పటికీ విూకు అంకితమై ఉంటానని అన్నారు. నమస్కారం నా సోదరీమణులు మరియు ప్రియమైన తెలంగాణ సోదరులారా, నేను విూ అందరి మధ్యకు రాలేకపోయాను కానీ విూ హృదయాలకు చాలా దగ్గరయ్యాను. ఈ రోజు నేను విూకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ తల్లి.. అమరుల పుత్రుల కల నెరవేరేలా చూడాలని అన్నారు. మనం అందరం దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. విూ కలలను నిజం చేసుకోండి. విూకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. విూరు నన్ను సోనియమ్మా అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. నన్ను తల్లిలా చూసుకున్నారు. ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ విూకు కృతజ్ఞుతగా ఉంటాను. ఎప్పటికీ విూకు అంకితమై ఉంటాను. తెలంగాణలోని మన సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి తమ శక్తినంతా వినియోగించి మార్పు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్‌కు ఓటు వేయండని సోనియా గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు.