సోమవారం సమన్లు జారీ చేయనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్మోహన్‌ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేయనుంది. ఈ రోజే సమన్లు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాటిని జారీ చేయలేక పోయింది. సోమవారం సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జగన్‌ను జైలులో ఇవాళ ఆయన చిన్నాన్న వైఎస్‌ వివేక్‌ కలుసుకున్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా ఆయన భార్య,కుమార్తె ఈ రోజు కలిశారు.