స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

హైదరాబాద్‌ : శిశు సంరక్షణ కేంద్రాలను తమ శాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఇంతవరకు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న శిశు సంరక్షణ కేంద్రాలను నియత్రించేందుకు విధి విధానాలు రూపొందించేందుకు 9 మందితో ఉన్నత స్థాయి కమీటి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ కమీటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామనిమంత్రి వెల్లడించారు.