స్ధానిక సంస్థలకు ఎన్నికలు

ఖమ్మం: వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ బాటలో వివిధ సభల్లో ఆయన మాట్లాడారు. కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ పదవులు ఇస్తామని తెలిపారు. శ్రీకాకుళం, ఆదిలాబాద్‌, చిత్తూరు జిల్లాల్లో ఫైలట్‌ ప్రాజెక్టుగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ఏర్పాటుకు యోచిస్తున్నామన్నారు. గిరిజన గ్రామాలకు విద్యుత్తు సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య సేవల్లో క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తామని పేర్కొన్నారు.