స్మితా సబర్వాల్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌కుమార్‌ ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో స్మితా సబర్వాల్‌ బాధ్యతలు చేపట్టారు.