స్వల్పంగా తగ్గిన ఇన్ఫోసిన్‌ నికర లాభం

ముంబయి : భారత. ఐటీ  దగ్గజం ఇన్ఫోసిన్‌ అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిన్‌ నికరలాభం స్వల్పంగా తగ్గింది. సంస్థ రూ. 2,369 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇంతకుముందే ఇదే సమయానికి సంస్థ నికర లాభం రూ. 2,372 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిన్‌ ఆదాయం 12 శాతం పెరిగి రూ.10,424 కోట్లకు చేరింది.