స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో గత అర్థరాత్రి వారు స్టాక్‌హోం నుంచి ఇటలీలోని మిలన్‌కు బయలుదేరారు.జులై 3వ తేదీనాటికి మిలన్‌ చేరుకుని 4న భారత్‌కు బయల్ధేరతారని సమాచారం.