స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలో భారతీయులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: గతనెల 29న స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలో 92మంది భారతీయులు చిక్కుకుపోయిన ఘటనతో తమకు ఏలాంటా సంబంధం లేదని అక్బర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం 92 మంది భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉన్నారని, వీరు భారత్‌కు తిరిగి వచ్చేందుకు వీలుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా చెల్లించిన చెక్కులు కూడా బౌన్స్‌ అయ్యాయని, అయినా తామెలాంటి ఇబ్బందులు సృష్టించలేదన్నారు. తమతో ఒప్పందం కుదుర్చకున్న సబ్‌ ఏజెంట్‌ హ్యాపీ హాలిడేస్‌ చేసిన తప్పిదం వల్లే భారతీయులు ఇబ్బంది పడినట్లు అక్బర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం వెల్లడించింది.