హత్య కేసు నిందితులు రిమాండ్.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 23, జనం సాక్షి.
   దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామానికి చెందిన అనుమండ్లకాడి వెంకటయ్య ను నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా చంపి ఇంట్లోనే పెట్రోలు పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే. మృతుని సోదరుడైన ఐలయ్య ఫిర్యాదు మేరకు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో తొగుట సీఐ కమలాకర్ కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు సిఐ కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటయ్య కుటుంబ సభ్యులు కూతురు ప్రణతి,అల్లుడు కనకయ్య,బావమరిది శ్రీహరి మరో వ్యక్తి దిలీప్ లు కలిసి ఇంట్లోనే చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు అంగీకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతే కాకుండా వెంకటయ్యను కలహాలతోనే చంపినట్లు అంగీకరించారన్నారు. అంతేకాకుండా వెంకటయ్య పాత నేరస్తుడు ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లి ఫిబ్రవరిలో విడుదల అయ్యారన్నారు. మొత్తానికి వెంకటయ్య చావుకి కుటుంబ కలహాలే కారణమని దర్యాప్తులో తేలిందని అన్నారు వారిని రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు.
Attachments area