హల్లో కేసీఆర్… జ్వరం తగ్గిందా.. ఎయిమ్స్ డాక్టర్లను ఇంటికి పంపాలా? : నరేంద్ర మోడీ
హల్లో కేసీఆర్… జ్వరం తగ్గిందా.. ఆరోగ్యం కుదుటపడిందా.. అంకా ఓకేనా కేసీఆర్జీ.? ఎయిమ్స్ డాక్టర్లను ఇంటికి పంపమంటారా? రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి రెస్ట్ తీసుకొని వెళ్లండి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించారు.

ఇటీవల ఢిల్లీలో అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఒకరోజు ముందే (16నే) ఢిల్లీ వచ్చారు. వర్షాలతో అప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో, అస్వస్థత కారణంగా ఈ సమావేశంలో ఆయన ఎక్కువసేపు కూర్చోలేదు. ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రసంగాల తర్వాత వెళ్లిపోయారు. తనకు జ్వరంగా ఉందని, తన ప్రసంగ పాఠాన్ని సీఎస్ రాజీవ్ శర్మకు ఇచ్చానని మోడీకి కేసీఆర్ తెలిపారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో మోడీని సోమవారం పార్లమెంటులో కలిశారు. ఈ సందర్భంగా వారిమధ్య మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ‘రెస్ట్ తీసుకోండి కేసీఆర్‌జీ.. అవసరమైతే చెప్పండి. ఎయిమ్స్ డాక్టర్లను ఇంటికి పంపుతాను. మొహమాటపడకండి’ అని మో[r చెప్పారు. సోమవారం పార్లమెంటులో కేసీఆర్ కలిసినప్పుడూ మోడీ అదే విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ అడిగారు.