హార్టీసెట్‌ ప్రవేశ పరీక్ష

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ కైఎస్సార్‌ ఉధ్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విధ్యనభ్యసించిన విద్యార్థులకు బీఎస్‌సీ హానర్స్‌ హార్టికల్చర్‌లో చేరేంరుకు హార్టీసెట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 165 మంది దరఖాస్తు చేసుకున్నారు. 151 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ కోర్సులో మొత్తం 21 సీట్లున్నాయి. ఈ పరీక్ష ఫలితాలను వారం రోజుల్లో ప్రకటిస్తామని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ తెలిపారు.