హిందూవుల పండగలపై టీఆర్ఎస్ సర్కార్ ఆంక్షలు

వినాయక చవితికి అనుమతుల పేరుతో యువకులకు వేధింపులు
మీర్పేట్ కార్పొరేషన్ నందిహిల్స్ లో గణేశ్ ఉత్సవ సమతి నిర్వాహకులకు సన్మానం
బీజేపీ అధికారంలోకి రాగానే ఆంక్షలు ఎత్తివేస్తాం- శ్రీరాములు అందెల
ఎల్బీ నగర్ ( జనం సాక్షి )హిందూవుల ఉత్సవాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధిస్తోందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ విమర్శించారు. మీర్ పేట కార్పొరేషన్ నందిహిల్స్ గణేశ్ ఉత్సవ సమితి, మండపాల నిర్వాహకులు, లడ్డూ గ్రహితలను శ్రీరాములు సన్మానించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ… వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలంటే పోలీసుల ఫర్మిషన్లు సహా ఇతర అనుమతుల పేరుతో హిందూ బంధువులను వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన ఎంఐఎం ఆదేశాలతోనే సాగుతుందని ఆరోపించారు. భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూవుల పండుగలపై ఆంక్షలు లేకుండా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్, మీర్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహా, కార్పొరేటర్ పెండ్యాల శివపార్వతి, నందిహిల్స్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తిరుపతిరెడ్డి, విక్కిసాగర్ ఆధ్వర్యంలో వివిధ అసోషియేషన్ ప్రెసిడెంట్స్, జీఎస్ లను సన్మానించారు.
Attachments area



