హిప్‌ హిప్‌ ముర్రే

యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన బ్రిటన్‌ సంచలనం
ఫైనల్‌లో జొకోవిచ్‌ పరాజయం
76 ఏళ్ళ బ్రిటన్‌ నిరీక్షణకు తెర
న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 11(ఆర్‌ఎన్‌ఎ): బ్రిటన్‌ టెన్నిస్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్టాత్మకమైన యుఎస్‌ ఓపెన్‌ కైవసం చేసుకున్నాడు. తద్వారా 76 ఏళ్ళ బ్రిటన్‌ నిరీక్షణకు తెరదించాడు. 1936లో ఫ్రెడ్‌ పెర్రీ తర్వాత అమెరికన్‌ టైటిల్‌ గెలిచిన తొలి బ్రిటన్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ¬రా¬రీగా సాగిన ఫైనల్‌లో ముర్రే 76 (12/10), 75, 26, 36, 62 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై విక్టరీ కొట్టాడు. ఊహించినట్టుగానే పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ కూడా నువ్వా నేనా అన్నట్టు సాగింది. దాదాపు ఐదు గంటలు జరిగిన మ్యాచ్‌ అభిమానులకు అసలు సిసలు టెన్నిస్‌ విందును అందించింది. ఫోర్‌ హ్యాండ్‌ ర్యాలీలు , అద్భుతమైన సర్వీసులతో పాటు ¬రా¬రీ టై బ్రేక్‌లలో ఫ్లష్టింగ్‌ మెడోస్‌ ¬రెత్తిపోయింది. మొదటి సెట్‌ నుండి ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. సర్వీసులు నిలుపుకోవడంతో టై బ్రేక్‌ తప్పలేదు. టై బ్రేక్‌ కూడా ఉత్కంఠగా సాగింది. రికార్డ్‌ స్థాయిలో 12-10తో ముర్రే ఈ సెట్‌ గెలుచుకున్నాడు. తర్వాతి సెట్‌లోనూ జోరు కొనసాగించిన ముర్రే 7-5తో గెలిచి ఆధిక్యం పెంచుకున్నాడు. అయితే మూడో సెట్‌ నుండి మాత్రం జొకోవిచ్‌దే పై చేయిగా నిలిచింది. అద్భుతంగా పుంజుకున్న సెర్బియన్‌ స్టార్‌ వరుస సెట్లలో నెగ్గి స్కోర్‌ సమం చేశాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌ ప్రారంభం నుండే దూకుడుగా ఆడిన బ్రిటన్‌ సెన్సేషన్‌ 3-0 ఆధిక్యంలో నిలిచినా… తర్వాత తడబడ్డాడు. అయితే ఈ అవకాశాన్ని జొకోవిచ్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మధ్యలో తొడ కండరాలు పట్టేయడం కూడా ప్రభావం చూపింది. దీంతో అనవసర తప్పిదాలతో వెనుకబడిపోయాడు. ఈ సమయంలో మరోసారి చక్కని ప్లేస్‌మెంట్‌ షాట్లు ఆడిన ముర్రే 6-2తో సెట్‌ గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌ గెలిచిన విషయాన్ని ముర్రే నమ్మలేకపోయాడు. స్టేడియంలో కూలబడి… మళ్ళీ తేరుకుని అభిమానులకు అభివాదం చేశాడు. మొత్తం 4 గంటల 54 నిమిషాల పాటు సాగిన తుది పోరు యుఎస్‌ ఓపెన్‌ చరిత్రలో మరో ¬రా¬రీ మ్యాచ్‌గా నిలిచిపోయింది. ఇప్పటి వరకూ ఐదుసార్లు గ్రాండ్‌శ్లామ్‌ ఫైనల్స్‌కు చేరుకున్న ముర్రేకు ఇదే తొలి విజయం. గత నాలుగు సార్లూ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2008లో యుస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన ముర్రే ఫెదరర్‌ చేతిలో ఓడిపోయాడు. తర్వాత 2010 , 2011 ఆస్టేల్రియన్‌ ఓపెన్‌ , ఈ ఏడాది వింబుల్డన్‌లలో తుదిమెట్టుపై చతికిలపడ్డాడు. ఓవరాల్‌గా ముర్రే కెరీర్‌లో ఇది 24వ టైటిల్‌. ట్రోఫీతో పాటు ఆండీ ముర్రేకు 10.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఈ ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ నెగ్గి సరికొత్త రికార్డ్‌ సృష్టించిన ఈ బ్రిటీష్‌ ప్లేయర్‌ తన చిరకాల కోరిక తొలి గ్రాండ్‌శ్లామ్‌ కలను నెరవేర్చుకున్నాడు.

ఆండీ ముర్రే కెరీర్‌ ః
ఫ్రొపెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ప్రారంభం – 2005
కెరీర్‌ రికార్డ్‌ – 370-118
కెరీర్‌ టైటిల్స్‌ – 24
ప్రస్తుత ర్యాంకింగ్‌ – 4
ఆస్టేల్రియన్‌ ఓపెన్‌ – రన్నరప్‌ ( 2010 , 2011)
ఫ్రెంచ్‌ ఓపెన్‌ – సెవిూఫైనలిస్ట్‌ (2011)
వింబుల్డన్‌ – రన్నరప్‌ (2012)
యుఎస్‌ ఓపెన్‌ – ఛాంపియన్‌ (2012)
టూర్‌ ఫైనల్స్‌ – సెవిూఫైనల్స్‌ (2008 , 2010)
ఒలింపిక్స్‌ – గోల్డ్‌ మెడల్‌ (2012 లండన్‌ గేమ్స్‌)