హిమాచల్‌లో అసెంబ్లీ ఓటింగ్‌ ప్రారంభం

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ కోసం 7,253 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్‌ పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ పడుతున్నాయి. మొత్తం 459 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఇందులో 27 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. డిసెంబర్‌ 20న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. సీఎం ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ నేతృత్వంలో మరోసారి అధికారం దక్కుతుందన్న ఆశలో భాజపా ఉండగా… ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజలు అధికారపక్షాన్ని గద్దెదింపి ప్రతిపక్షాన్ని గద్దెనెక్కిస్తారన్న ధీమాలో కాంగ్రెస్‌ ఉంది.