హైకోర్టు తీర్పును స్వాగతించిన లోక్‌సత్తా
హైదరాబాద్: స్థానికసంస్థలకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును లోక్ సత్తా స్వాగతించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని ఆ ఆ పార్టీనేత కఠారి శ్రీనివాసరావు డిమాండ్ వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల అంశం అడ్డంకి కాబోదని ఆయన పేర్కోన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐపీఎస్ అధికారుల మధ్య ఏర్పడిన వివాదంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. పోలీసు సంస్కరణలు అమలుచేస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.